IPL 2021 : How MI, KKR, RR, PBKS Can Make IPL Playoffs - Explained || Oneindia Telugu

2021-10-04 1,373

IPL 2021: Here's a look at the qualification scenarios for Mumbai Indians, Kolkata Knight Riders, Punjab Kings and Rajasthan Royals as they remain on 10 points.

#IPL2021Playoffs
#RCB
#MI
#KKR
#CSK
#IPL2021PointsTable


ఐపీఎల్ 2021 సీజన్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించగా.. మూడో బెర్తును ఆర్‌సీబీ దక్కించుకుంది. దాంతో మిగిలిన ఒక్క బెర్త్ కోసం నాలుగు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.ఐపీఎల్ 2021 సీజన్ పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 18 పాయింట్లతో టాప్-2లో కొనసాగుతుండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. 12 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు శుక్రవారం ముగియనుండగా.. అప్పటికి పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించనున్నాయి.